Site icon NTV Telugu

Kala VenkatRao: అమరావతి నిర్మాణానికి నిధులేవి?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలిచ్చే పరిస్థితి లేదన్నారు.

రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదు.? ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి మాత్రం నిధులు ఉన్నాయా.?కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే 78 శాతం పూర్తి చేసిన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, 69 శాతం పూర్తి అయిన ఐఎఎస్, 72 శాతం పూర్తైన గెజిటెడ్ అధికారులు నివాసాలు అందుబాటులోకి వచ్చేవన్నారు. రాజధానిపై ఈ ప్రభుత్వానికి దురుద్దేశం లేకుంటే ఆపేసిన నిర్మాణాలు ఎందుకు ప్రారంభించడం లేదు.?రాజధానిలో టీడీపీ నిర్మించిన 5,028 ఇళ్లను పేదలకు ఇవ్వాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

SV Vedic Varsity VC: ఎట్టకేలకు వీసీ సుదర్శనశర్మపై వేటు 

Exit mobile version