Site icon NTV Telugu

సీఎం జగన్ రాజ్యాంగ అతీతుడిలా వ్యవహరిస్తున్నారు…

ఏపీ సీఎం రాజ్యాంగ అతీతుడిలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావ్. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉంది ప్రభుత్వ వైఖరి. ఆరువేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. గతంలో దూరంగా ఉండి మా నిరసన తెలిపేవాళ్లం. ఈరోజు కలెక్టరేట్ గేటు వరకూ వచ్చాం…రేపు కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్తాం. ఎన్నికలు దగ్గరపడితే సీఎం ఆఫీస్ లోకి కూడా వెళ్తాం అని తెలిపారు. పేదల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అవసరమైతే జైలు భరో నిర్వహిస్తాం… జైళ్లకు వెళ్తాం. గత ప్రభుత్వంలో చేసిన ఉపాధి పనుల బిల్లులు ఇచ్చి తీరాల్చిందే. ఇచ్చే వరకూ మా పోరాటం కొనసాగిస్తాం అని పేర్కొన్నారు.

Exit mobile version