Site icon NTV Telugu

ఆ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : కళా వెంకట్రావు

జాతీయ ప్రాజెక్టైన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లిన ప్రభుత్వం.. సెకీ ఒప్పందం విషయంలో రివర్స్ టెండరింగుకు ఎందుకు వెళ్లడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కాయి.. అయినా రివర్స్ టెండరింగుకు వెళ్లిన విషయం ప్రభుత్వం మరిచిందా అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ లభిస్తోంటే.. రూ. 2.49కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారోననే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సోలార్ పవర్ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగుకు వెెళ్లాలి. 7 వేల మెగా వాట్ల పవర్ ప్లాంట్ ఏపీలో పెట్టుంటే.. 17500 మంది నిపుణులకు ఉద్యోగవకాశాలు వచ్చేవి. ఏడు వేల మెగా వాట్ల పవర్ ప్లాంట్ ఏపీలో పెడితే రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అడిగారు.

సెకీతో ఒప్పందం చేసుకోవాలనేది తమ నిర్ణయం కాదని ప్రభత్వం నిర్ణయమని ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ మాటల్లో మర్మం కన్పిస్తోంది. సెకీ ఒప్పందంలో ఏదో లాలూచీ జరిగిందని ఇంధన కార్యదర్శి మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏమైనా తేడాలుంటే తనకు ఇబ్బంది రాకుండా ఉండేలా ఇంధన కార్యదర్శి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కన్పిస్తోంది. ప్రభుత్వం ఏ ఒప్పందం చేసుకున్నా తమకు ప్రతిఫలం వస్తుందనే ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్నారు.సెకీతో చేసుకోవాలనుకుంటున్న ఒప్పందం కూడా ఇదే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్రం సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు.

Exit mobile version