Counting Day: ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజు (డిసెంబర్ 9) కాకినాడ జేఎన్‌టీయూలో కొనసాగనుంది. ఈ నెల 5న ఈ నియోజకవర్గం పరిధిలోని కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ప్రక్రియలో 15, 495 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 రౌండ్స్ లో 9 టేబుల్స్ పై ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.
Read Also:
అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టననున్నారు అధికారులు. ఇక, బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు.. గంధం నారాయణరావు, దీపక్ పులుగు, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకట లక్ష్మీ, బొర్రా గోపీమూర్తి ఉన్నారు. కాగా, విజేతగా నిలిచిన వ్యక్తికి రెండేళ్ల 2 నెలల పదవీ కాలంలో కొనసాగుతారు.