NTV Telugu Site icon

MLC Election Results: పీడీఎఫ్ అభ్యర్థి ఘన విజయం.. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు..!

Mlc Election

Mlc Election

MLC Election Results: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి విజయం సాధించారు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపి మూర్తి.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందినట్టుగా చెబుతున్నారు.. గోపి మూర్తికి ఎనిమిది వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారట.. పోలైన ఓట్లను బట్టి ఆయనకు.. 7,745 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.. అయితే, ఇప్పటి వరకు గోపిమూర్తికి 9,163కు పైగా ఓట్లు వచ్చాయి.. తన సమీప ప్రత్యర్థి గంధం నారాణరావుకు 5,008 ఓట్లు రావడంతో.. గోపి మూర్తి విజయం ఖాయం అంటున్నారు..

Read Also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ఇక, అన్ని టేబుల్స్‌లోనూ తన హవా కొనసాగించారు గోపి మూర్తి.. టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కింపు మొదలు పెట్టారు. మెదటి టేబుల్‌లో వేయి ఓట్లలో గోపి మూర్తికి 665, రెండో టేబుల్‌లో 665, మూడో టేబుల్‌లో 607, 4వ టేబుల్‌లో 698, 6వ టేబుల్‌లో 580, 8వ టేబుల్‌లో 585, 9వ టేబుల్‌లో 544, 10వ టేబుల్‌లో 581, 11వ టేబుల్‌లో 556, 12వ టేబుల్‌లో 607, 13వ టేబుల్‌లో 544, 14వ టేబుల్‌లో 666 ఓట్లను గోపి మూర్తి సాధించారు. అయితే, 5వ టేబుల్‌కు సంబంధించి ఓట్లు ఇంకా లెక్కిస్తున్నట్టుగా చెబుతున్నారు.. అయితే, ఇప్పటి వరకు వచ్చిన ఓట్ల ప్రకారం.. మొదటి ప్రాధాన్యతా ఓటులోనే గోపిమూర్తి విజయం సాధించడం దాదాపు ఖాయమైపోయింది..