Deputy CM Pawan Kalyan: నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? అని ప్రశ్నించారు.. నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి కామెంట్ చేసిన ఆయన.. అయితే, 15 ఏళ్లు తక్కువ కాకుండా కూటమి ఉండాలని ఆకాక్షించారు.. నా లాంటి వాడు రోడ్డు మీదకి వస్తే నిద్రాహారాలు మానేస్తారు.. ఆడ పిల్లలను వేధించడం మగతనం కాదు.. పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాను.. పిఠాపురంలో ఈవ్ టీజింగ్ కనిపించకూడదు అని హెచ్చరించారు.
Read Also: Mrunal – Dulquer : మరోసారి జతకట్టనున్న సీతారామం జంట.. ఈ సారి వేరే లెవల్
వీఐపీ ట్రీట్ మెంట్ ఆగి కామన్ మెన్ ట్రీట్మెంట్ మొదలు అవ్వాలి.. ఆరు నెలలు హాని మూన్ పీరియడ్ ఆగిపోయింది.. పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు మొదలు పెడతాను అన్నారు పవన్ కల్యాణ్.. గుండాలు చంపేస్తాను అంటారు.. కానీ, ఆకు రౌడీలకు నేను భయపడను.. మందు పాతరలు పెట్టిన పరవాలేదు అని అడవులకి వెళ్లాను.. తెగించాను అంటే పిచ్చగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.. ప్రతి జిల్లాకి వస్తాను.. అది పిఠాపురం నుంచే మొదలు పెడతాను అని ప్రకటించారు.. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఇలానే ఉంటుందన్నారు.. మొత్తం అవినీతి అయిపోయింది.. తగ్గించే ప్రయత్నం జరుగుతుందన్నారు.. మొత్తం నిర్మూలించలేం.. అయితే, ప్రేమ అయినా.. గొడవ అయినా సిద్ధమే అని వెల్లడించారు.. అయితే, తిరుపతి ఘటన నేపథ్యంలో.. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా మనస్సు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు పాల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రముఖపాత్ర వహించాలి అన్న పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..