NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: అన్నింటిపై ఆరా తీస్తున్న పవన్‌ కల్యాణ్‌..

Pawan 2

Pawan 2

Deputy CM Pawan Kalyan: కాకినాడ జిల్లాలో రెండో రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. రెండో రోజు పర్యటనలో అన్ని శాఖల సమీక్షలపై ఫోకస్‌ పెట్టారు పవన్‌.. కలెక్టరేట్‌లో అన్ని శాఖలపై సమీక్షలు నిర్వమిస్తున్నారు.. పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్‌.. గత ఐదేళ్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు.. మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకి అందిన ప్రోత్సాహాలపై ఆరా తీశారు.. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీలు ఎలా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.. ఇక, గ్రామాల్లో ఏ నిష్పత్తిలో నిధులు ఖర్చు పెడుతున్నారని అధికారులను ప్రశ్నించారు పవన్.. పన్నులు వసూలు ఆశించిన స్థాయిలో లేదన్నారు.. త్రాగునీటి కోసం ఎంత ఖర్చు అవుతుందని పవన్‌ ప్రశ్నించారు.. గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యంపై ఫోకస్ పెట్టాలని.. దానికి ఎలాంటి కార్యాచరణ అవసరం అనేదానిపై సమావేశంలో చర్చించారు.

Read Also: Amazon Prime Day Sale 2024: ‘అమెజాన్‌’ ప్రైమ్‌ డే సేల్‌.. ఫ్రీ, వన్‌ డే డెలివరీ!

జిల్లా గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి జిల్లాలో అమలవుతున్న కార్యకలాపాలపై ఆరా తీశారు పవన్.. ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో పీడబ్ల్యుఎస్ పథకాలు అమలు, గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు, మంచినీటి ట్యాంకుల కో-ఆర్డినేషన్, జలజీవన్ మిషన్ పనులు.. తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగితెలుసుకున్నారు.. మరోవైపు.. అటవీ శాఖ అధికారులు రివ్యూలో పవన్‌ కీలక వ్యాఖ్యలు చేవారు.. కాకినాడలో మడ అడవులు ధ్వంసం చేస్తున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. 90 ఎకరాలలో మడ అడవులు ఉంటే 58 ఎకరాలు కొందరు అక్రమార్కులు లేఅవుట్ గా మార్చేస్తే మీకు సంబంధం లేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పాటించరా? అని నిలదీశారు.. అధికారులు ప్రభుత్వం కోసం కాదు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు.. కోరింగ అభయారణ్యంలో సారా తయారీ జరుగుతుందని సమాచారం ఉంది.. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జీవరాశులు మనుగడ ఉండదు కదా? అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.

Read Also: CM Chandrababu: వరుస రివ్యూలు.. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ..

ఇక, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యు ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌ చేపట్టిన సమీక్షా సమావేశాల్లో.. జిల్లా కలెక్టర్షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను పవన్ కల్యాణ్‌కు అధికారులు వివరిస్తున్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.