Annavaram Temple: సత్య దేవుని భక్తులకు షాక్ ఇచ్చారు అధికారులు.. వసతి గదుల అద్దె భారీగా పెంచారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదుల అద్దెలను దేవస్థాన అధికారులు పెంచారు. ఈ కొత్త అద్దెలు డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భక్తుల రద్దీ పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం, సౌకర్యాల మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.
Read Also: Delhi Car Blast: వామ్మో.. ఉగ్రవాదులు ఒళ్లు గగుర్పొడిచే ప్లాన్.. వెలుగులోకి కొత్త ప్రణాళిక!
కొత్త అద్దెల వివరాల్లోకి వెళ్తే.. హరిహర సదన్‌లో ఇప్పటికి వరకు అద్దె రోజుకు (24 గంటలకు) రూ.950గా ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆ మొత్తాన్ని రూ.1,500కి పెంచారు.. సత్రం గది రోజుకు రూ.600గా ఉంటే… ఆ మొత్తాన్ని రూ.800కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రకాశ్ సదన్‌లో ఇప్పటి వరకు రోజుకు రూ.999గా ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి రూ.1,260 వసూలు చేయనున్నారు.. న్యూ CCC/ఓల్డ్ CCC లో రూ.500 ఇప్పుడు వసూలు చేస్తుండగా.. ఇకపై రూ.700కు చెల్లించాల్సి ఉంటుంది.. సౌకర్యాల మెరుగుదల కోసం ధరల పెంపు అంటున్నారు అధికారులు..
దేవస్థానం ఆధీనంలో ఉన్న వసతి గదుల్లో శుభ్రత, బెడ్స్, బెడ్ షీట్స్, దుప్పట్లు.. విద్యుత్, నీటి వసతులు ఇలాంటి సౌకర్యాలు మెరుగుపర్చడంపై ఆ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.. ఇక, సత్యదేవుని ఆలయం దగ్గర ఉన్న ఈ వసతి గదులను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే అవకాశం ఉన్న విషయం విదితమే.. అయితే, అద్దెల పెంపుపై భక్తుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భక్తులు ధరలు ఎక్కువయ్యాయని భావిస్తుంటే, మరికొందరు సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉన్నందుకు ఇది సమంజసమేనని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా.. పెరిగిన గదుల అద్దె ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.. కొత్త అద్దెలు ఆన్‌లైన్ బుకింగ్, దేవస్థానం కౌంటర్లలో ఒకేసారి అమల్లోకి రానున్నాయి.
