Site icon NTV Telugu

సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ

గత ఏడాది నవంబరులో అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తిస్థాయిలో మెరుగుపడింది. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ… ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన కుటుంబానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Read Also: నేటితో ‘అఖండ’ 50 రోజులు.. 103 సెంటర్లలో మాస్ జాతర

బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కాల్‌ చేసి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వడం చాలా గొప్ప విషయయని కైకాల కొనియాడారు. సీఎం జగన్ హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా తమ ఇంటికి వచ్చి వైద్య ఖర్చులతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారని పేర్కొన్నారు. కళాకారుల పట్ల అలాగే ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని నటుడు కైకాల సత్య నారాయణ తన లేఖలో వివరించారు. కాగా లేఖపై తాను సంతకం చేయలేకపోవడంతో తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని కైకాల వివరించారు.

Exit mobile version