NTV Telugu Site icon

బ్రహ్మంగారిమఠంలో టెన్షన్ టెన్షన్..

కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పరిస్థితులు టెన్షన్ టెన్షన్ గా ఉంది.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు పోలీసులు. బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అక్కడ చర్చలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గ్రామస్థులకు కూడా ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరిక జారీ చేసారు. కానీ పీఠాధిపతుల రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మమ్మ. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై డీజీపీకి ఫిర్యాదు చేసారు మహాలక్ష్మమ్మ. అయితే పెద్ద కుమారుడు వెంకటాద్రికి మద్దతుగా ఆందోళన చేసేందుకు కందిమళ్లాయపల్లె గ్రామస్థులు సిద్ధమయ్యారు.