NTV Telugu Site icon

Kakinada: ఒరినాయనో.. ఒక్క చేప ఖరీదు రూ.3.10 లక్షలా..!

Fish

Fish

Kakinada: మత్స్యకారులు సముద్రాల్లో వేటకు వెళ్లినప్పుడు అరుదైన చేపలు అప్పుడప్పుడు వలలకు చిక్కుతున్నాయి. అధిక బరువును మోసే పెద్ద చేపలు పట్టుబడుతున్నాయి. కొన్ని అరుదైన చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని అరుదైన చేపల ధర లక్షల రూపాయలు. అలాంటి చేపలు పడితే మత్స్యకారుల పంట పండినట్లే. గోదావరి జిల్లాల్లో ఇలాంటి చేపలు మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి. కాకినాడ మత్స్యకారులు ఇటీవల అరుదైన చేపను పట్టుకున్నారు. 20 కిలోల చేప దొరికింది. కుంభాభిషేకం రేవు వద్ద మత్స్యకారుల వలలో ఈ చేప చిక్కింది. ఈ చేప రూ. 3.10 లక్షలకు మత్స్యకారులు విక్రయించారు. చేపలను కొనుగోలు చేసే వ్యాపారులు దీనిని కొనుగోలు చేశారు. అత్యంత అరుదైన కాచిడీ చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ చేపలకు లక్షల్లో డిమాండ్ ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. కాచిడీ చేపను అనేక వ్యాధులకు తయారుచేసే మందులలో ఉపయోగిస్తారు.

Read also: Hyderabad City Bus: ఫ్లైట్ లో కూడా ఇంత రేటు ఉండదు.. సిటీ బస్సు టిక్కెట్ రూ.29వేలా..!

పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, కటిల్ ఫిష్ నుండి సేకరించిన పదార్థాలతో వైద్యులు ఆపరేషన్ తర్వాత కుట్లు కోసం దారాలు తయారు చేస్తున్నారు. ఈ చేప అనేక వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. దేశ, విదేశాల్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉందని, కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే గతంలో ఏపీలో చాలాసార్లు మత్స్యకారులు పచ్చి చేపలను పట్టుకున్నారు. వీటి విక్రయంతో మత్స్యకారులకు కూడా భారీగా ఆదాయం వచ్చింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అయితే ఇవి అప్పుడప్పుడు మాత్రమే వలలో చిక్కుకుంటాయని, దొరికితే శుభసూచకమని మత్స్యకారులు చెబుతున్నారు. కాచిడీ చేపలు గతంలో గోదావరి జిల్లాల్లో చాలాసార్లు దొరికాయి. గతంలో ఒక చేపను ఇలా రూ.4 లక్షలకు విక్రయించారు.
Headache: తలనొప్పితో భరించలేకపోతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే..

Show comments