కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారన్నారు కేఏ పాల్. ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నానన్నారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారు. చంద్రబాబు 120 సంవత్సరాలు బతుకుతాడట, నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతాడన్నారు. ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నానని ..లోకేష్ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది… ఓ పక్క జగన్ మరోపక్క లోకేష్ వాళ్ళ తండ్రులను చూసుకొని రెచ్చిపోతున్నారని ఆయన మండిపడ్డారు. నేను రింగులోకి వస్తే అందరి సంగతులు తేలుస్తానని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్.. డబ్బులకి అమ్ముడుపోయాడు..నా ఛారిటీస్ మీద చంద్రబాబు పడుతున్నాడు.. కరెక్ట్ గా వారం తర్వాత నేనేంటో చూపిస్తానన్నారు. చంద్రబాబు కి వారం టైం ఇస్తున్నాను..నా జోలికి వస్తే నేను మీ జోలికి వస్తా… అందరి లెక్కలు తీరుస్తానని చెప్పుకొచ్చారు.
సుగాలి ప్రీతి ఇష్యూ సీరియస్ గా తీసుకుంటాను…నిమిషా కేసును ఎట్లా అయితే ఓ కొలిక్కి తీసుకువచ్చానో… అలాగే సుగాలి ప్రీతి కేసు పై పోరాడుతాను.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు… పాస్టర్ ప్రవీణ్ పగడాల మందు తాగడం మీరు చూశారా… లేక మీరేమైనా మందు పోసారా అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
