NTV Telugu Site icon

Abdul Nazeer: ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్

Syed Abdul Nazeer

Syed Abdul Nazeer

Justice Syed Abdul Nazeer Appointed As AP Governor: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ని నియమించింది. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. గతంలో అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో అబ్దుల్ ఒకరు. ట్రిపుల్ తలాఖ్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. ఈనెల 24వ తేదీన పదవీ విరమణ చేసిన ఆయన్ను బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఏపీ గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. అటు బిశ్వభూషణ్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా కేంద్రం పంపింది.

New Governors: 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం..

మరోవైపు.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బాయిస్‌ను మహారష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో కోష్యారీపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీకి వంతపాడుతున్నారని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, ఎన్సీపీలు ఆరోపించాయి. ఇక ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలైతే మహారాష్ట్రలో ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో ఆయన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించి, ప్రధాని మోడీకి లేఖ రాశారు.

మొత్తం గవర్నర్ల జాబితా:
1. ఏపీ – సుప్రీంకోర్టు మాజీ జడ్జి సయ్యద్ అబ్దుల్ నజీర్
2. ఛత్తీస్‌గఢ్ – బిశ్వభూషణ్ హరిచందన్
3. మహారాష్ట్ర – రమేష్
4. సిక్కిం – లక్ష్మణ్‌ప్రసాద్
5. అరుణాచల్‌ప్రదేశ్ – త్రివిక్రమ్ పర్నాయక్
6. జార్ఖండ్ – రాధాకృష్ణన్
7. అస్సాం – గులాబ్‌చంద్ కటారియా
8. హిమాచల్‌ప్రదేశ్ – శివప్రసాద్ శుక్లా
9. మణిపూర్ – అనసూయ
10. లడఖ్ – బీడీ మిశ్రా
11. నాగాలండ్ – గణేషన్
12. మేఘాలయ – చౌహాన్
13. బిహార్ – రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్