విజయవాడలోని నొవాటెల్ హోటల్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పాల్గొన్నారు. హోటల్‌కు చేరుకున్న బిషప్‌లు, క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందర్బంగా సీజేఐతో కేక్ కట్ చేయించారు. బిషప్‌లకు జస్టిస్ ఎన్వీరమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు.
వేడుకల్లో ఎపి, తెలంగాణ హైకోర్టు సీజేలు .. జడ్జిలు తదితర ఉన్నతాధికారులు పాల్గన్నారు. మరోవైపు నోవాటెల్ హోటల్‌లో ఉన్న సీజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సీజేఐ రాష్ర్ట పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. సీజేఐ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజీబీజీగా ఉన్నారు.దేశ ప్రజలకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మత సామరస్యంతో మెలగాలని సీజేఐ అన్నారు.
