Site icon NTV Telugu

చర్చలు సఫలం.. ఏపీలో సమ్మె విరమించిన జూడాలు..

Junior Doctors

Junior Doctors

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం-జూనియర్‌ డాక్టర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. జూడాలతో మంత్రి ఆళ్లనాని, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు.. వారి డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేశారు.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు జూడాల ప్రతినిధులు.. కాగా, తమ డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జూడాలు.. ఇవాళ్టి నుంచి సమ్మె దిగారు.. ఫ్రంట్‌లైన్‌ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కోవిడ్‌ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండు చేశారు.. ప్రభుత్వంతో ఇప్పటికే జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం కాగా.. ఇవాళ్టి చర్చలు సఫలం కావడంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.

Exit mobile version