Site icon NTV Telugu

Jogi Ramesh: దాచుకోవడం, దోచుకోవడం చంద్రబాబుకే సాధ్యం

Jogi Ramesh

Jogi Ramesh

ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని మంత్రి జోగి రమేష్ ఖండించారు. టీడీపీ విధానాలు చూసి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి పనికిమాలిన వాళ్లను 14 ఏళ్లు ఎలా భరించామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్లటం నేరమా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ దావోస్‌కు వెళ్లడం టీడీపీ వాళ్లకు కడుపు మంటగా ఉందని చురకలు అంటించారు.

Pattabhi: సీబీఐ కోర్టు అనుమతులను జగన్ ఉల్లంఘించారు

మరోవైపు టీడీపీ నేతలపై వ్యక్తిగతంగా మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. యనమల రామకృష్ణుడు ఓ వృద్ధ జంభూకం అని.. పట్టాభి ఓ పంది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అల్జీమర్స్‌ రోగం ఉందని ఎద్దేవా చేశారు. పట్టాభికి కడుపు మంట రోగం ఉందని.. యనమలకు కడుపు ఉబ్బరం రోగం ఉందని విమర్శలు చేశారు. చంద్రబాబు 38 సార్లు విదేశీ పర్యటనలు చేశాడని.. ఆయన వెళ్తూ దోపిడీ దొంగలను కూడా వెంట తీసుకుని వెళ్లేవాడని జోగి రమేష్ ఆరోపించారు. దేశంలో దోచుకోవడం, దాచుకోవటం, దోపిడీ చేయటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. యనమలకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదన్నారు. వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం వేదికగా ఇప్పటికే ఆరు ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుందని జోగి రమేష్ వివరించారు

Exit mobile version