NTV Telugu Site icon

Jogi Ramesh: నేను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా

Jogi Ramesh

Jogi Ramesh

ఏపీలో అధికార, విపక్ష నేతలు విమర్శల మీద విమర్శలు చేసుకుంటున్నారు. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. రాజ్యాంగం టీడీపీ వారికి వర్తించదా? ఎలాగైనా వ్యవహరించవచ్చని రాసుందా? చింతకాయల విజయ్ అనేవాడు అరాచకవాది. ఐటీడీపి అనే దాన్ని అతను పర్యవేక్షిస్తున్నాడు. మహిళల మాన, ప్రాణాల గురించి వెబ్ సైట్ లో దారుణంగా పోస్టులు పెట్టాడు. అతని దగ్గరకు సీఐడీ పోలీసులు వెళ్తే దాడి చేసినట్టు తప్పుడు కథనాలు రాశారన్నారు.

దొంగ ఇంటికి పోలీసులు వెళ్తారని తెలీదా?విజయ్ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడు?ఒక దొంగని ఎల్లోమీడియా సపోర్టు చేస్తోంది.విజయ్ తప్పు చేయకపోతే ధైర్యంగా వచ్చి ఆ మాట సీఐడీ పోలీసులకు చెప్పాలి. ప్రభుత్వ స్థలాన్ని తండ్రి ఆక్రమించాడు. ప్రొక్లెయిన్ తీసుకుని వెళ్తే తండ్రి పారిపోయాడు. కొడుకు తప్పుడు పని చేసి గోడదూకి పారిపోయాడు. అయ్యన్నపాత్రుడు నోరు తెరిస్తే పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, అయ్యన్న పాత్రుడుకి కొడుకుల మీద నమ్మకం పోయినట్లుంది.

Read Also:Prabhas: అఫీషియల్.. రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్

అందుకే ఏం మాట్లాడాలో తెలియక బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలకు జగన్ 50శాతం రిజర్వేషన్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తుంటే మీరేమో దుర్మార్గాలు చేస్తున్నారు. వారిని సమర్ధిస్తే రేపు మీ కుటుంబ సభ్యుల మీద కూడా పోస్టులు పెడతారని హెచ్చరించారు మంత్రి జోగి రమేష్.

Read Also: IND Vs SA: గౌహతిలో టీమిండియా పరుగుల సునామీ.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్