NTV Telugu Site icon

ఉద్యోగాల కల్పన, ఉపాధి అన్నది లక్ష్యం కావాలి : సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ మెహన్‌ రెడ్డి ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో ఉన్నస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ నిరంతరం కొనసాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలి, విద్యాపరంగా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటన్నది కనిపించాలని ఆయన అన్నారు. వీసీలు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి, ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలన్నారు. ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకు వచ్చామని, డిగ్రీని నాలుగేళ్ల కోర్సు చేశామని ఆయన తెలిపారు.

కోర్సుల్లో కూడా చాలా మార్పులు తీసుకు వచ్చామని, ఇకపై కూడా దీనిపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండాలని, ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా వీసీలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, మీ మార్కు కచ్చితంగా కనిపించాలని, సర్టిఫైడ్‌ కోర్సులను కరిక్యులమ్‌లో భాగంగా చేయాలని సీఎం జగన్‌ అన్నారు.