Site icon NTV Telugu

నెల్లూరులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు…

నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిందాల్ స్టీల్ ప్లాంటుకు 860 ఎకరాల కేటాయించారు. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో జిందాల్ స్టీల్ ప్లాంటుకు భూమి ఇచ్చారు. గతంలో కిన్నెటా పవర్ కు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసి.. జిందాల్ స్టీల్సుకు కేటాయించారు. రూ. 7500 కోట్ల రూపాయలతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయనుంది జిందాల్ స్టీల్స్. 2500 మందికి నేరుగా, మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం… వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ విస్తరణకు 1000-3000 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేసింది.

Exit mobile version