NTV Telugu Site icon

Tadipatri: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం

Atp Jc

Atp Jc

అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాజకీయం హాట్ హాట్ గా వుంటుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం మామూలుగా వుండదు. తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్‌ మొదలైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దీక్షకు దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అనంతపురం రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ ముందు జేసీ దీక్షకు దిగారు. ఎలాంటి పర్మిషన్స్‌ తీసుకోకుండా తాడిపత్రి మున్సిపాలిటీలో చేపడుతోన్న అక్రమ నిర్మాణాలను ఆపాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

తాము ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్‌ చేసినా పట్టించుకోవడం లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన బంధువుల ఆస్తులకు నష్టం జరగకుండా డ్రైనేజీని కుదించి కట్టిస్తున్నారని, దీన్ని ఆపకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. టీడీపీ కౌన్సిలర్లతో కలిసి ప్రభాకర్‌రెడ్డి ఆందోళనకు దిగడంతో అధికారులు హైరానా పడ్డారు. అక్రమ నిర్మాణాలను ఆపేవరకు కదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. మొదటినుంచి జేసీ పెద్దా రెడ్డి మధ్య రాజకీయ వైరం వుంది.ఇప్పుడది కొనసాగుతూనే వుంది. తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రెండు పార్టీల నేతలు టెన్షన్ పడుతుంటారు.
MLC Jeevan Reddy : నేను చెప్పింది తప్పయితే ఎన్నికల్లో పోటీ చేయను