23, 24, 25 తేదీల్లో జేసీ నాగిరెడ్డి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి టీమ్ లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ పాలనలో కనీసం గుడికి వెళ్లేందుకు కూడా పర్మిషన్ తీసుకోవాలంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జేపీ ప్రభాకర్ రెడ్డి.
రాయదుర్గంలో స్వామి వారి కల్యాణంలో తప్పు చేశారని, తప్పు ఒప్పుకోకుండా సవాళ్లు చేస్తారా.. పోలీసులతో అడ్డుకుంటారా అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైఫల్యం చెందారు కాబట్టే గడప గడప అంటున్నారని, గడప గడపకూ వెళ్తే రాళ్ల తో కొట్టే రోజులు వస్తాయంటూ ఆయన మండి పడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, అడుగడుగాన అక్రమాలు, ఆక్రమణలే ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
