NTV Telugu Site icon

Pawan Kalyan: వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేదంటే చర్యలు తప్పవ్.. పవన్ భార్య విషయంలో జనసేన లీగల్ సెల్ వార్నింగ్

Janasena Legal Cell Warning

Janasena Legal Cell Warning

Janasena legal Cell Warning: ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఏపీలో రాజకీయం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో విడిపోతున్నారని, ఆమె ఇప్పటికే పిల్లల్ని తీసుకుని సొంత ప్రదేశం అయిన రష్యాకు వెళ్ళిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయం మీద జనసేన తెలివిగా స్పందిస్తూ ఫొటో షేర్ అలాంటిదేమీ లేదనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా సరే ఆ ప్రచారానికి బ్రేకులు పడకపోవడంతో జనసేన లీగల్ టీం ఇప్పుడు రంగంలోకి దిగింది. తాజాగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక హెచ్చరిక జారీ చేస్తూ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆయన భార్య విడిపోతున్నారని తప్పుగా ప్రచారం చేస్తూ పవన్ అభిమానుల్లో కలకలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటూ జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రకటనలో పేర్కొంది. కావాలనే కొంతమంది వ్యక్తులు తప్పుడు ఉద్దేశాలతో ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.

Amitabh Bachchan: మక్కీకి మక్కీ దించేస్తే ఎలా సార్?

వారి దరిద్రపు కోరికలు తీర్చుకునేందుకు కొంతమంది కుట్ర దారులు కలిసి ఇదంతా చేస్తున్నట్లు జనసేన దృష్టికి వచ్చిందని హెచ్చరించారు. ట్విట్టర్లో కొన్ని ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేస్తూ వెంటనే బేషరతుగా పవన్ కళ్యాణ్ దంపతులకు క్షమాపణలు చెప్పాలని తాము తప్పుడు ప్రచారం చేయబోయినట్టు ఒప్పుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ అలా క్షమాపణ చెప్పకపోతే వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఇలాంటి ఫాల్స్ న్యూస్ సర్కులేట్ చేస్తున్నావారందరి మీద చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు, సెక్షన్ section 153,499,500 and 120-B read with 34 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనసేన ట్యాగ్ చేసిన అకౌంట్లలో కొన్ని వ్యక్తిగత అకౌంట్లతో పాటు పార్టీల అకౌంట్లు కొన్ని వార్త ఛానల్స్ అకౌంట్లు కూడా ఉండడం గమనార్హం.