NTV Telugu Site icon

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

ఏపీలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన సభను చూస్తే జనసేనకు జనం బ్రహ్మరధం పడుతున్నారని అర్థమైందన్నారు. కేంద్రానికి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పారన్నారు.

వైఎస్సార్ ప్రభుత్వం కేంద్రం మీద వత్తిడి తీసుకురాలేదన్నారు దుర్గేష్. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై అఖిల పక్షం వేయాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే వైసీపీ పట్టించుకోవడం లేదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు వైఎస్సార్ ప్రభుత్వానికి పట్టవు.. ప్రతిదానికీ సజ్జల మాట్లాడతారని విమర్శించారు. గంజాయి సాగు విపరీతంగా సాగుతోంది మూలాలు ఏపీలోనే ఉన్నాయన్నారు. వైఎస్సార్ అమ్మఒడి జనవరి లో ఇస్తానని జూన్ లో ఇస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తూర్పారబడతాం అన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను బరిలో నిలబెడతామన్నారు జనసేన నేత దుర్గేష్.