Pawan Kalyan Donation: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం అందిస్తోంది జనసేన పార్టీ.. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు బీమా సదుపాయం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2022-23 సంవత్సర కాలానికి జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను పవన్ కల్యాణ్ చెల్లించారు. ఇక, వార్షిక సంవత్సరం ముగిసిన కొత్త 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం కానుండడంతో.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కోశాధికారి కేవీ రత్నంకు అందజేశారు..
Read Also: ICC Test Rankings: రెండో స్థానంలో అశ్విన్, టాప్-10లోకి జడేజా.. ఆల్‌రౌండర్లుగానూ..
పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద బీమా చేయించే నిమిత్తం గత రెండేళ్లుగా ఏటా రూ.కోటి చొప్పున విరాళాన్ని అందజేస్తూ వచ్చారు పవన్ కల్యాణ్… ఇక, మూడో ఏటా తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు.. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాక్షించారు జనసేన అధినేత వపన్ కల్యాణ్. కాగా, జనసేనతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం విదితమే. మరోవైపు.. ఫోన్ ద్వారా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది జనసేన పార్టీ.. కొత్తగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, క్రియాశీలక వాలంటీర్లుగా బాధ్యత చేపట్టాలనుకునేవారు 08069932222 నంబర్‌కు కాల్ చేసి.. బీప్ సౌండ్ తరువాత మీ పేరు, నియోజకవర్గం పేరు చెప్పాలని జనసేన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
క్రియాశీలక కార్యకర్తల బీమా నిమిత్తం రూ.కోటి విరాళం అందజేసిన శ్రీ @PawanKalyan గారు#JSPMembershipPhase3
Link: https://t.co/DfbNZaUPB6 pic.twitter.com/saOZQHG1Ew
— JanaSena Party (@JanaSenaParty) February 22, 2023
