NTV Telugu Site icon

మైపాడు బీచ్ లో జలకన్య.. వీడియో వైరల్..?

గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య వలలో చిక్కినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక జలకన్య వలలో చిక్కినట్లు చూపిస్తూ ఆమె ఎలా ఉంటుందో చూపించారు. అయితే ఇదంతా నిజమేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఆక్వా కోఆపరేటివ్‌ మార్కెట్‌ డైరెక్టర్‌ పామంజి నరసింహులు ఈ విషయమై స్పందించారు.

బీచ్ లో జలకన్య వీడియో అంతా ఫేక్ అని, అలాంటి వార్తలు నమ్మవద్దని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ వీడియో ఇక్కడిది కాదని, పదిరోజుల క్రితం కర్ణాటకలో జరిగిందని తెలిపారు. కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేసి, నాలుగైదు రోజుల నుంచి మైపాడు బీచ్ లో జలకన్య కనిపించినట్లు వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆ ఆకతాయిలను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.