NTV Telugu Site icon

Jyothula Chantibabu: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం…?

Jyothula Chantibabu

Jyothula Chantibabu

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి… కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జ్యోతుల చంటిబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి…? ఆయన పార్టీ నుంచే బయటకు వెళ్లడానికి సిద్ధం అయ్యారా? పార్టీలో పొసగడంలేదా? వచ్చే ఎన్నికల్లోపు మరో పార్టీలోకి జంప్‌ అవుతారా? ఇలా రకరకాల చర్చలు సాగుతున్నాయి.. ఇంతలా చర్చగా మారడానికి ఆయన చేసిన తాజా కామెంట్లే కారణం.. ఎందుకంటే.. పార్టీలు, గాడిద గుడ్డు.. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. మేం ఏమైనా ఈ పార్టీ లో శాశ్వతమా? అని హాట్‌ కామెంట్లు చేశారు జ్యోతుల చంటిబాబు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం.. ఇప్పుడున్న వారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో..? రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో..? ఎవరికి తెలుసు..? అంటూ వ్యాఖ్యానించారు..

Read Also: Tamilnadu: మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. వీడియో వైరల్

ఇక, ఏపీలోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌పై కూడా యన సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది.. పెన్షన్ తీసుకునే సామాన్యుడు ఇన్‌కమ్ టాక్స్ కట్టగలడా? అని ప్రశ్నించారట జ్యోతుల చంటిబాబు. ఆయన ఇంతలా మాట్లాడడానికి ఆయనపై వస్తున్న విమర్శలే కారణం అనే చర్చ సాగుతోంది.. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే విమర్శలు రావడం.. మరోవైపు నుంచి ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదన్న అసహనంతోనే జ్యోతుల చంటిబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.. కాగా, జ్యోతుల చంటిబాబు పూర్తి పేరు జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండరావు .. జగ్గంపేట నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే, జ్యోతుల చంటిబాబు 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో 17907 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.. ఇక, 2014లో ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో 15932 ఓట్ల తేడాతో మరో ఓటమి చవి చూశారు.. అయితే, 19 మార్చి 2018న టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు.

Show comments