NTV Telugu Site icon

Andhra Pradesh: నేడు జగనన్న తోడు పథకం ద్వారా డబ్బులు జమ

Jagananna Thodu

Jagananna Thodu

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో జగనన్న తోడు కూడా ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం రూ.10 వేలు రుణం అందిస్తోంది. అధిక వడ్డీ భారం నుంచి చిరు వ్యాపారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. లబ్ధిదారుల పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రుణాన్ని అందజేస్తోంది. ఈ మేరకు ఈరోజు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. జగనన్న తోడు పథకం ద్వారా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూరనుంది.

Read Also: Without Makeup: మేకప్‌ లేకుండా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్‌ మీకోసం.

బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్ల రుణాలు అందించనుంది. గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌‌ను ప్రభుత్వం అందిస్తోంది. ఈ మేరకు లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్‌గా సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, చేతి వృత్తులు వారు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందొచ్చు. అయితే ఈ పథకం పొందడానికి 18 ఏళ్లు వయసు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేలకు లోపు, పట్టణాల్లో రూ.12 వేలులోపు ఉండాలి. ఆధార్ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్ కలిగి ఉండాలి. విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. షాపు రిజిస్టరేషన్ పత్రం కావాలి. పొలం 10 ఎకరాలకు లోపు ఉండాలి.