ఏపీలో యూరియా కొరత, రైతుల సమస్యలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు.. కానీ రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తానే ఇవ్వలేక పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ విమర్శలు గుప్పించారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే..బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? అంటూ మండిపడ్డారు.
మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబుగారూ? అంటూ విమర్శించారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేసి, బస్తా యూరియా రేటు రూ.267లు అయితే, దీనికి మరో రూ.200లు అధికంగా అమ్ముకుంటున్నారన్నారు. . అక్రమ నిల్వలపై తనిఖీల్లేవు, ఎవ్వరిమీదా చర్యల్లేవు.PACSలకు, RBKలకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరేకదా చంద్రబాబుగారు..మా హయాంలో RBKల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశాం.. PACSల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50ల తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబుగారూ? అంటూ ట్వీట్ చేశారు మాజీ సీఎం జగన్..
