NTV Telugu Site icon

జగన్ పై కుట్రలు చేస్తే ఉరుకోం: మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ


మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మహిళల ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతకు జగన్‌ మోహన్‌రెడ్డి కంకణబద్దులై ఉన్నారన్నారు. గతంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదన్నారు. మహిళ పక్షపాతి అనే దురుద్దేశంతో జగన్‌ పై కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ, నామినేట్‌డ్‌ పదవులు, పార్టీ పదవుల్లో మహిళలకు అధికంగా అవకాశం కల్పించారన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారన్నారు.


ఆడవారిని తిట్లు తిట్టే నీచ సంస్కృతికి రాజకీయాలు దిగజారిపోయాయని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడు లేనంతగా మహిళల్లో మార్పు వస్తుందని, ఇకనైనా ప్రతి పక్షాలు కుట్రలు మానుకోవాలన్నారు. 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నందుకు ఆహ్వానించక పోవడం దురదృష్టకరమన్నారు. మహిళా హోం మంత్రిని దూషించడం ఏంటని ప్రతి పక్షాలపై మండిపడ్డారు. ఇది మహిళలపై జరుగుతున్న దాడిగా వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.