ఉగాదికి కుదరలేదు, అందుకే మే 30న ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగాది పండుగ పూట జగన్ ప్రకటించాలనుకున్న జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించ లేకపోయింది. దీన్ని వచ్చే నెల 30వ తేదీ నాటికి వాయిదా వేసినట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో సీఎస్ స్థాయిలో కూడా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి అయినా.. ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ లేకపోవడం వల్ల అనుకున్న సమయానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయారనే చర్చ జరుగుతోంది. మే నెల 30 నాటికి సీెఎంగా జగన్ పాలనా పగ్గాలు చెపట్టి రెండేళ్లు పూర్తి కానుంది.. అదే రోజు ఉద్యోగాల నియామక క్యాలెండర్ సీఎం జగన్ ప్రకటించే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ఈ క్రమంలో ఏ ఒక్క నియమాకం చేపట్టాలన్న ఖజానా పై ఆర్ధిక భారం పడుతుంది.. దీంతో ఆర్ధిక శాఖ కొత్త నియమాకాలకు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లే ఉగాది నాడు చేయాల్సిన ప్రకటన వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. దానిలో దాదాపు లక్షా 23 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం మూడు నెలల కాలంలో నియామకాలను చేపట్టి చరిత్ర సృష్టించారు జగన్. ఇప్పుడు వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాల భర్తీ పై దృష్టి సారించారు. దీని కోసం సిఎస్ ఆదిత్య నాధ్ దాస్ నేతృత్వంలో అధికారులు పలుమార్లు దీనిపై కసరత్తు చేశారు. మొత్తం ఖాళీలెన్నో.. ఎన్ని భర్తీ చేస్తామనేది త్వరలో జగన్ సర్కార్ ప్రకటించనుంది.
Also Read
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్‌పై సజ్జల తీవ్ర విమర్శలు..
రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా.. గతంలో పని చేసిన ఆయా ప్రభుత్వాలు అడపాదడపా ఎపీపీఎస్సీ ద్వారా నియమాకాలు చేపట్టి చేతులు దులుపుకున్నాయి. దీంతో చాలా పోస్టులు భర్తీ కాకుండా పెండింగులో ఉండిపోయాయి. ఏళ్ల తరబడి నియమకాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఖాళీలల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి తాత్కాలికంగా పని చేయించుకుంటున్నారు. 3.50 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఏపి లో వివిధ విభాగాలలో పని చేస్తున్నారు.
1970 లో కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన కాంట్రాక్ట్ లేబర్ యబాలిషస్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం శాశ్వత స్వభావం పని ఉన్నచోట కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ విధానం లో ఉద్యోగాల నియమకం చేపట్టడం కుదరదు. కానీ చట్టం తెచ్చిన కేంద్రం గానీ.. దానిని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు గాని దానికి తూట్లు పొడుస్తున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లో నియమకాలు చేపట్టి శాశ్వత నియమకాలకు ప్రభుత్వాలు తిలోదకాలిస్తున్నాయి. అనేక శాఖలలో.. హెచ్వోడిలల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. సుమారు అన్ని ఖాళీలు కలిపి సుమారు 50 వేలకు పైగా పోస్టుల ఉండే అవకాశం ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయాలంటే ఆర్ధిక శాఖ అనుమతి ఇవ్వాలి. ఉగాదికి ఇవ్వాల్సిన నియమాక క్యాలెండర్ ప్రకటన ఆగిపోవడానికి ఆర్ధిక శాఖ క్లియరెన్స్ లేకపోవడమే అనే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 30న ప్రకటించే క్యాలెండర్ ఎన్ని ఉద్యోగాలకు క్లియరెన్స్ ఇస్తారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!