Site icon NTV Telugu

కోవిడ్‌ చికిత్స విధానాలపై ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలి: జగన్‌

కోవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉందని తెలిపిన అధికారులు. 1.06 లక్షలకు పైగా కేసుల్లో 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని తెలిపిన అధికారులు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనని వెల్లడించారు. 18 ఏళ్ల పైబడ్డ వారికి 90.34 శాతం మందికి రెండు డోసుల వాక్సినేషన్‌ పూర్తి చేయాలని తెలిపారు.


15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న వారికి 98.91శాతం మొదటి డోస్‌ పూర్తి చేశామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జగన్‌ అధికారులకు కీలక సూచనలు చేశారు. కోవిడ్‌ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ అమలు తీరు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలన్నారు. విప్లవాత్మకమైన చర్యగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామన్నారు.

Read Also: ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే పాత జీతాలే ఇవ్వాలి: వెంకట్రామిరెడ్డి

జీఎంపీ ప్రమాణాలున్న మందులనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామన్నారు. ఇంతకు ముందు ఎవ్వరూ ఇలా చేయలేదన్నారు. నాడు–నేడు కింద గతంలో ఎప్పుడూ లేని విధంగా డబ్బు ఖర్చు చేస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు కాలక్రమేణా దేశానికి తప్పనిసరిగా ఆదర్శనీయంగా నిలుస్తాయన్నారు. కనీసం 8–10 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండి ఆరోగ్యశ్రీ అమలుపై ఆరా తీయాలని ఆరోగ్యశ్రీ సీఈఓను సీఎం జగన్‌ ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలనల ద్వారా ఆరోగ్యశ్రీ మరింత బలోపేతంగా ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు.

Exit mobile version