NTV Telugu Site icon

ISRO: ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం.. ఇంకా అందని డేటా

Isro Sslv Launching

Isro Sslv Launching

Data Not Received From SSLV D1: ఆదివారం నాడు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం సాంకేతికంగా విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం ఉదయం 9:18 నిమిషాలకు జరిగింది. ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్ ఈవీఎస్ 02, ఆజాదీ కా శాట్‌ను అనే రెండు ఉపగ్రహాలను క్షక్ష్యలోకి తీసుకెళ్లింది. అయితే ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం భౌతికంగా సక్సెస్ అయిందా? లేదా అన్నదానిపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ ప్రయోగంలోని అన్ని దశలు సజావుగానే పూర్తయ్యాయని.. కానీ టెర్మినల్ దశలో సమాచార నష్టం జరిగినట్టు ఇస్రో ప్రకటించింది.

Read Also: Rakshabandhan 2022: సోదరికి గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తున్నారా?.. ఈ బహుమతులు ఇవ్వండి

సాధారణంగా రాకెట్ ప్రయోగం జరిగిన 12 నిమిషాల్లోపే డేటా రావాల్సి ఉందని ఇస్రో అభిప్రాయపడింది. ఎందుకంటే తక్కువ కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించినదే ఎస్ఎస్ఎల్వీ. కానీ ఇందుకు సంబంధించిన కచ్చితమైన సమాచారం మధ్యాహ్నం అయినా ఇంకా ఇస్రోకు చేరలేదు. అజాదీకాశాట్ ఉపగ్రహ వాహక నౌక నుంచి విడిపోయిందని.. కక్ష్యలోకి చేరిందా? లేదా అన్నది రాత్రికి కానీ తెలియదని ఇస్రో పేర్కొంది. ఎస్ఎస్ఎల్వీ రాకెట్, అది కక్ష్యలో ప్రవేశపెట్టిన శాటిలైట్లకు సంబంధించి డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. రాకెట్‌లోని వీటీఎం మాడ్యూల్ ఫంక్షన్ పనిచేయలేదని.. దీంతో కక్ష్య వేగాన్ని సాధించడం సాధ్యపడలేదని, మొత్తంగా ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఇస్రో పూర్తిస్థాయి విశ్లేషణ తర్వాతే ఫలితంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.