NTV Telugu Site icon

Ayyanna Patrudu : ఇది ముమ్మాటికీ కబ్జానే.. ఇరిగేషన్ శాఖ వివరణ

Ayyanna patrudu

Ayyanna

ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్‌ నెలకొంది. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్‌ అధికారులు కూల్చివేశారు. నిన్నరాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అంతేకాకుండా అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. అనుమతి లేదంటూ మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికారులు అక్రమంగా గోడను కూల్చివేశారని అయ్యన్న కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్‌ శాఖ వివరణ ఇచ్చింది. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్, నీలంపేట ఛానెల్, నర్సీపట్నం పట్టణ పరిధిలోని శివపురం దగ్గర నీలంపేట ఛానెల్ కు గోడలు కట్టింది ఇరిగేషన్ శాఖ.

అయితే.. సరిగ్గా ఈ గోడ కట్టిన చోటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి నిర్మాణం చేశారు. ఇరిగేషన్ శాఖ గోడలపైనే అయ్యన్న పాత్రుడు బేస్ మెంట్ నిర్మించినట్లు ఇరిగేషన్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఛానెల్ ఒడ్డున నదిలోకి పది అడుగుల వరకు ఆక్రమించారని ఇరిగేషన్ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఆక్రమణకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది.