Site icon NTV Telugu

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు… భయాందోళనలో ప్రయాణికులు

విశాఖ నుంచి న్యూ ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం తెల్లవారుజామున పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. లోపాన్ని గమనించిన రైలు సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. ఎస్-6 బోగీ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయని ప్రయాణికులు వాపోయారు.

అయితే ట్రైన్ బ్రేకులు జామ్ కావడంతోనే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది వివరించారు. లోపాన్ని సరిచేస్తున్నామని వారు తెలిపారు. కాగా గంటకు పైగా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

Exit mobile version