Infosys: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పాలనను విశాఖపట్నం రాజధానిగా ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందని ఇప్పటికే పలువురు మంత్రులు స్పష్టం చేశారు.. అయితే, ఇదే సమయంలో.. ఇతర సంస్థల సైతం విశాఖకు తరలివస్తున్నాయి.. ఇప్పటికే విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రకటించింది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. అయితే, ఇప్పుడు ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు చేశారు.. మే 31వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు దిగ్గజ ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ ప్రకటించింది.. 650 మంది ఉద్యోగులతో వైజాగ్‌లో తన కార్యకలాపాలను ఆరంభించనుంది.. ఋషికొండ సిగ్నటివ్ టవర్స్ లో కార్యకలాపాలు ప్రారంభం కానుండగా.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉన్న ఉద్యోగులకు వైజాగ్ క్యాంపస్‌లో ప్రాధాన్యత ఇస్తోంది ఇన్ఫోసిస్.
Read Also: Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు
కాగా, విశాఖ కేంద్రంగా తొలిదశలో 1,000 మందికి ఇన్ఫోసిస్ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపిన విషం విదితమే.. ఇన్ఫోసిస్ రాక విశాఖ అభివృద్ధికి సంకేతమన్న ఆయన.. ఇప్పటికే కొన్ని ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీరికి కావాల్సిన ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా అందించమని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని వెల్లడించారు.. వారు కోరిన విధంగా అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాజా ఉద్యోగులతో పాటు త్వరలో కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కొత్త ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.. ఇక బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన గతంలో వెల్లడించిన విషయం విదితమే.