Site icon NTV Telugu

Indrakeeladri : దుర్గమ్మ చీరల వ్యవహారంలో రికార్డ్‌ అసిస్టెంట్‌ సస్పెండ్‌..

Vijayawada Durgamma Temple

Vijayawada Durgamma Temple

అమ్మలు కన్న అమ్మ దుర్గమ్మకే ఏగనామం పెడుతున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటికే దుర్గమ్మ చీరల గొడవ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దుర్గమ్మ చీరకల వ్యవహారంలో రికార్డ్‌ అసిస్టెంట్‌ను ఆలయ ఈవో సస్పెండ్‌ చేశారు. 2019-20 సంవత్సరాల్లో అమ్మవారికి భక్తులు సమర్పించిన 77 చీరల లెక్కల్లో అవకతవకలు బయటపడ్డాయి. అయితే.. ఈ చీరలు విలువ 6 లక్షల 50వేలు ఉంటుందని అధికారులు గుర్తించారు.

అయితే ఈ నేపథ్యంలో.. చీరల మాయం వ్యవహారంలో రికార్డ్ అసిస్టెంట్ తిరుమల సుబ్రమణ్యం సస్పెండ్ చేశారు అధికారులు. గతంలో కూడా చీరల మిస్ మ్యాచ్ విషయంలో 6నెలల పాటు సుబ్రమణ్యం సస్పెండ్‌ చేశారు. అప్పుడు ఈఓ గా సురేష్ బాబు ఉన్నారు. నకిలీ ఇండెంట్లు సబ్మిట్ చేసి రికార్డ్ అసిస్టెంట్ సుబ్రమణ్యం దొరికిపోయాడు. నిన్న రాత్రి ఆలయ ఈఓ భ్రమరాంబ సుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.

 

Exit mobile version