Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్‌న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

Indian Railways

Indian Railways

Indian Railways: క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగలకు సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఇప్పటికే రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోయి, వెయిటింగ్ లిస్ట్ చూసి ఆందోళన పడుతున్నారా? అయితే మీకు దక్షిణ కోస్తా రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు (ఫిబ్రవరి 1) వరకు పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఏకంగా 54 అదనపు రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

పొడిగించిన ఆ ఆరు స్పెషల్ రైళ్ల పూర్తి వివరాలు ఇవే:

సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ (07425 / 07426): సికింద్రాబాద్ నుంచి ప్రతి ఆదివారం నడిచే 07425 రైలును డిసెంబర్ 6 నుంచి జనవరి 31 వరకు, శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రతి సోమవారం బయలుదేరే 07426 రైలును డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 1 వరకు పొడిగించారు. ఈ 18 సర్వీసులు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి.

చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ (07037 / 07038): చర్లపల్లి నుంచి ప్రతి మంగళవారం నడిచే 07037 రైలును డిసెంబర్ 1 నుంచి జనవరి 26 వరకు, శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రతి బుధవారం నడిచే 07038 రైలును డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకు పొడిగించారు. ఈ 18 సర్వీసులు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

చర్లపల్లి – కాకినాడ టౌన్ (07039 / 07040): చర్లపల్లి నుంచి ప్రతి గురువారం నడిచే 07039 రైలును డిసెంబర్ 3 నుంచి జనవరి 28 వరకు, కాకినాడ టౌన్ నుంచి ప్రతి శుక్రవారం నడిచే 07040 రైలును డిసెంబర్ 4 నుంచి జనవరి 29 వరకు పొడిగించారు. ఈ 18 సర్వీసులు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. పండగ సీజన్‌లో ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీల బాధ లేకుండా, హాయిగా ఊరెళ్లి రావాలనుకునే ప్రయాణికులకు ఇది నిజంగా పెద్ద ఊరట. టికెట్లు అయిపోకముందే వెంటనే బుక్ చేసుకుంటే సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.