Site icon NTV Telugu

Union Minister Srinivasa Varma: స్టీల్ పరిశ్రమ అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది..

Srinivas Varma

Srinivas Varma

Union Minister Srinivasa Varma: ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా అవతరించడం ఆనందంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన నూతన స్టీల్ సెక్టార్‌లో పరిశోధన, అభివృద్ధి, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్టీఎంఐ) వెబ్-పోర్టల్‌లో స్టీల్ కొల్లాబ్ ప్లాట్‌ ఫారాంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ.. స్టీల్ పరిశ్రమ రంగంలో సాధించిన అభివృద్ధి గురించి చర్చించడం ఆనందంగా ఉందన్నారు. నూతన స్టీల్ సెక్టార్‌లో ఎస్ఆర్టీఎంఐ వెబ్-పోర్టల్‌లో స్టీల్ కొల్లాబ్ ప్లాట్‌ ఫారమ్‌ను విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఉక్కు తయారీలో నూతన ఆవిష్కరణలు, స్థిరత్వం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి ప్రధాన మోడీ నాయకత్వంలో బలమైన పునాదిని వేశామని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Read Also: Suvendu Adhikari: బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తాం..

అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఉక్కు డిమాండ్ తో జీడీపీ వృద్ధిని అధిగమించింది.. ఇది ఆర్థికాభివృద్ధిలో కీలకమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. స్టీల్ రంగ వృద్ధిలో స్థిరత్వాన్ని సాధించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు ఈ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఎస్ఆర్టీఎంఐ వెబ్ సైట్ ద్వారా ఆసక్తిగల వాటాదారులను, ఈ రంగం అభివృద్ధికి సహకరించడానికి ఆహ్వానిస్తుండటంతో పాటు నూతనంగా ప్రారంభించిన మూడు ఆర్అండ్ డీ పథకాలు స్టీల్ రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని శ్రీనివాస వర్మ చెప్పుకొచ్చారు.

Exit mobile version