AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరి కొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఇవాల్టి నుంచి వాయుగుండ ప్రభావం ప్రారంభం కానుందని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, వాయువ్య దిశగా పయనించి రెండు రోజులు తమిళనాడు-శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 27,28,29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
Read also: Health Tips: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే పలు చోట్ల చలి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి విజృంభిస్తోంది. గత ఐదు రోజులుగా చలి ఎనిమిది డిగ్రీలకు చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాడేరులో వాహనదారులు ఉన్ని బట్టలు వేసుకున్నా చలికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. అప్పటి వరకు వాహనదారులు హెడ్‌లైట్ల వెలుగులో ప్రయాణిస్తున్నారు. కొన్ని చోట్ల పొగమంచు వర్షంలా కురుస్తుంది. అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్!