Site icon NTV Telugu

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Rain

Rain

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సారిగా వెదర్ మారిపోయింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొనింది. ఇక, హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమైందని.. అలాగే, ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Read Also: Vinay Bhasker: ఆజాం జాహి మిల్లును మూసింది కాంగ్రెస్ ప్రభుత్వమే..దాస్యం కీలక వ్యాఖ్యలు

ఇక, బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొనింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.

Read Also: Minister Seethakka: కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా మూడు రోజులు వర్షాలు పడనున్నాయని చెప్పుకొచ్చింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అమలాపురం, కాకినాడ, నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Exit mobile version