ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం.. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్ ను బదిలీ చేశారు.. ఇక, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా వాడరేవు విజయచంద్‌ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ మల్లికార్జున్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా ఎం హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేసిన ఏపీ సర్కార్.. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండిగా వీరపాండ్యన్, కర్నూలు కలెక్టర్‌గా కోటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా వెంకటరమణారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా జేసీగా (ఆర్ అండ్ బీ) సుమిత్ కుమార్, శ్రీకాకుళం జేసీ (ఆర్ అండ్ బీ) డా. బీఆర్ అంబేద్కర్, హ్యాడ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డైరెక్టర్‌గా అర్జున్‌రావును బదిలీ చేశారు.. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణిమోహన్‌కు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు, చిత్తూరు జేసీ (ఆర్ అండ్ బీ)గా స్వస్నిల్ దినకర్, శాప్ ఎండీగా ప్రభాకర్ రెడ్డిని బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
AP Govt