ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము….
పాడరా నీతెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ భారతము…. ఈపాట 1986 లో అమెరికా అబ్బాయి సినిమాలోని మన భారతదేశం గురించి మన తెలుగు ఖ్యాతి గురించి ఆపాట కానీ.. ఆపాట ఇప్పుడు పాటగానే మిగిపోయే పరిస్థితి వస్తోంది. ఆంగ్లపై మోజు ఇతర దేశాలకు వెళ్లి చదువుకుని ఉద్యోగం చేయాలనే తపనతో తెలుగు భాషను మరిచిపోతున్నారు ఈకాలం పిల్లలు. ఆంగ్లేయులను మన దేశంనుంచి తరిమికొట్టేందుకు పోరాటాలే జరిగినా.. కానీ వారి ఆంగ్ల భాష మాత్రం మనవాళ్లకు గుండెకు హత్తుకునేలా చేసినట్లైంది. తెలుగు భాషను మరిచి ఆంగ్ల భాషపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు ఈకాలం యువత. తల్లి దండ్రులు సైతం పిల్లలకు ఆంగ్లభాష మాట్లాడేందుకే ఎక్కవగా ఆశక్తి చూపడం విశేషం. A,B,C,D అంటూ నేర్పిస్తున్నారే గానీ.. అ,ఆ,ఇ,ఈ అంటూ నేర్పించడం మరిచిపోతున్నారు. దీంతో మాతృభాష కనుమరుగవుతుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో.. మూడో తరగతి విద్యార్థులు కూడా తెలుగును తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. అయితే.. ఈ విషయంలో ఏకంగా 52 శాతం మంది కనీస ప్రమాణాలు చేరుకోలేదు. మొత్తం విద్యా ర్డుల్లో 19 శాతం మంది ఒక్క పదమూ సరిగా పలకలేక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గణితంలో ఏపీలో 47 శాతం, తెలంగాణలో 48 శాతం మంది కనీస ప్రమా ణాలను అందుకోలేకపోయారు. ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ (ఎస్ఎల్ఎన్) పేరిట అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. ఇక, తెలంగాణలో ‘తొలిమెట్టు’ పేరుతో ఆగస్టు 15న దీనికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా మౌఖికంగా, రాతపూర్వకంగా పరిశీలించారు. మొత్తం 20 మాతృభా షల్లో, గణితంలో 3వ తరగతి విద్యార్థుల పరిస్థితిపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) తాజాగా నివేదికను విడుదల చేసింది.
Read also: Ram Charan: ఆ కల్ట్ సినిమాకి 12 ఏళ్లు…
ఈ..సర్వేలో భాగంగా ప్రతి రాష్ట్రంలో కొందరు విద్యార్థులను కలిసి నివేదిక రూపొందించారు. అయితే.. దేశంలోని 10 వేల ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులు 8 వేల మందికి సంబంధించిన అధ్యయన నివేదిక ఇది. తెలుగు రాష్ట్రాల్లో 183 పాఠశాలల్లోని 1,583 మంది విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ప్రపంచస్థాయి ప్రమాణాల ప్రకారం నిమిషంలో 8 పదా లలోపు మాత్రమే చదవగలిగిన వారిలో కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేదని అర్థం. 9-26 మధ్య పదాలను తప్పులు లేకుండా చదివితే ప్రపంచ కనీస ప్రమాణాలను పాక్షికంగా అందుకున్నట్లు లెక్క. 27-50 మధ్య పదాలు చదవగలిగితే ప్రపంచ కనీస సామర్థ్యాలను కలిగి ఉన్నారని లెక్క. దీని ప్రకారం ఏపీ, తెలంగాణలలో సగటున 52 శాతం మందిలో కనీస అభ్యసన సామర్థ్యాలు లేవని స్పష్టమైంది… ఇక అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా వరకు మెరుగ్గా ఉన్నారు. ఎఫ్ఎల్ఎన్ అమలు తర్వాత ఏమేర మార్పు వస్తుందో వేచిచూడాలి.
steal train engine: రైలు ఇంజిన్‌ను మాయం చేసిన దొంగల ముఠా.. ఎలాగో తెలిస్తే షాకవుతారు?