Hyderabadi Woman Cheated Software Employee In The Name Of Marriage: పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీలు ఎక్కువ అయిపోతున్నారు. ఎలాగోలా అబ్బాయిల్ని పరిచయం చేసుకొని, పెళ్లి పేరుతో దగ్గరై, తమ ముగ్గులోకి దింపి, ఆ తర్వాత లక్షలకు లక్షలు కాజేసి ఉడాయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. రివర్స్‌లో వేధింపుల కేసులో ఇరికిస్తామనో, లేకపోతే చంపేస్తామనో బెదిరింపులకు దిగుతున్నారు. ‘వుమన్ కార్డ్’ని అడ్డం పెట్టుకొని, ఎందరో కి‘లేడీ’లు ఇలాంటి దారుణాలకు తెగపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ కూడా.. పెళ్లి పేరుతో ఓ టెక్కీని నిండా ముంచేసింది. అతని వద్ద నుంచి రూ.10 లక్షలు దోచుకుంది. తిరిగి అడిగితే.. ప్రియుడితో కలిసి చంపేస్తానంటూ వార్నింగ్‌లు ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Varahi Yatra: పవన్ వారాహి యాత్రకు లైన్ క్లియర్
అనకాపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గతంలోనే వివాహం అయ్యింది కానీ, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ టెక్కీ రెండు పెళ్లి కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతనికి మ్యాట్రిమోని ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పరిచయం అయ్యింది. తాను న్యాయవాదినంటూ అతడ్ని పరిచయం చేసుకుంది. అయితే.. తనని పెళ్లి చేసుకోవాలంటే, కచ్ఛితంగా ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని ఆమె కండీషన్ పెట్టింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం లేదని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని చెప్పాడు. దీంతో.. తనకు బకరా దొరికాడని భావించి, అతడ్ని దోచేసేందుకు ఆ మహిళ ఓ ప్లాన్ వేసింది. తనకు తెలంగాణ హైకోర్టులో పరిచయాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని అతడిని నమ్మించింది. కాకపోతే.. ఉద్యోగం రావాలంటే, కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పింది.
Syria Chopper Crash: సిరియా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మంది అమెరికా సైనికులకు గాయాలు
అప్పటికే ఆ మహిళ ట్రాప్‌లో పడ్డ ఆ టెక్కీ.. తనకు ఈ ఉద్యోగం వస్తే, ఆమెని పెళ్లి చేసుకోవచ్చని భావించాడు. ఆమె చెప్పినట్టుగానే.. 2022 అక్టోబరులో రూ.5 లక్షలు, అనంతరం నవంబర్‌లో మరో రూ.5 లక్షలు బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించాడు. తనకు డబ్బులు వచ్చిన తర్వాత.. ఆ మహిళ అతడ్ని క్రమంగా దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఉద్యోగం గురించి కూడా ప్రస్తావించలేదు. ఇదిగో, అదిగో అంటూ దాటవేస్తూ వచ్చింది. చివరికి ఓపిక నశించి.. ఉద్యగం సంగతి ఏమైందంటూ ఆమెని ప్రశ్నించాడు. ఒకవేళ ఉద్యోగం కన్ఫమ్ అవ్వకపోతే, తన డబ్బులు తిరిగివ్వాలని కోరాడు. అప్పుడు ఆ మహిళ తన నిజస్వరూపం బయటపెట్టింది. డబ్బులడిగితే, తన ప్రియుడితో కలిసి చంపేస్తానని బెదిరించింది. ఆమె ఇచ్చిన షాక్‌తో ఖంగుతిన్న ఆ టెక్కీ.. మరో దారి లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
