NTV Telugu Site icon

Hyderabad Rains: కొనసాగుతున్న ఆవర్తనం.. ఈనెల 15 వరకు వర్షాలు..

Hyderabad Rains

Hyderabad Rains

Hyderabad Rains: మహానగరంలో మరోసారి వర్షం మొదలైంది. ఇవాళ (మంగళవారం) ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, షేక్ పేట్.. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్ష ప్రభావం హైదరాబాద్ నగరంలో మరో 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Read also: Vizag MLC Elections: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు

వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనా వేస్తున్నా అధికారులు. హైదరాబాద్‌లో ఆగస్టు 15 వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD)హెచ్చరించింది. గురువారం వరకు నగరంలో వర్షాలు కురుస్తాయని, వాతావరణం ప్రధానంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌లో వర్షం పడే సూచనలు ఉన్నాయి.

Read also: Tuesday Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రాలు వింటే జగన్మాత స్నప్ప దర్శనం..

మరోవైపు ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Hanuman Chalisa: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి

Show comments