NTV Telugu Site icon

West Godavari Crime: మారిపోయానన్నాడు.. ఇంటికి తీసుకొచ్చి క్రూరంగా చంపాడు

Husband Killed Wife

Husband Killed Wife

Husband Brutally Killed Wife In West Godavari: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మారిపోయానని నమ్మించి, బ్రతిమిలాడి భార్యను ఇంటికి తీసుకొచ్చి, అత్యంత క్రూరంగా హతమార్చాడు. తలను రెండు ముక్కలు చేశాడంటే.. అతడు ఎలాంటి రాక్షసుడో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే.. వీరంపాలెంకు చెందిన గంజి దావీదుకి నిర్మల (30)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. అయితే.. కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతీ చిన్న విషయంపై భార్యతో భర్త గొడవ పడేవాడు. దీంతో.. నిర్మల తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఈ క్రమంలో దావీదు మద్యానికి బానిస అయ్యాడు. అప్పటి నుంచి అతని ఆకృత్యాలు మరింత పెరిగాయి.

Spider Nesting Inside Ear: చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చూసి షాకైన డాక్టర్లు..

కువైట్ వెళ్లిన భార్య తనకు డబ్బు పంపడం లేదంటూ.. కుమార్తెలను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి కుమార్తెల్ని చిత్రహింసలకు గురి చేసే వీడియోని కుమారుడితో రికార్డ్ చేయించి.. కువైట్‌లో ఉన్న నిర్మలకు పంపించాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, దావీదుని అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. అప్పుడు నిర్మల తన పిల్లలతోనే ఉండాలని నిర్ణయించుకొని, కువైట్ నుంచి భారత్‌కు తిరిగొచ్చి, పుట్టింట్లో ఉండసాగింది. కట్ చేస్తే.. రెండు నెలల క్రితం జైలు నుంచి బయటకొచ్చిన దావీదు, తాను మారిపోయానంటూ భార్యను నమ్మించేందుకు ప్రయత్నించాడు. తాను ఈసారి బాగా చూసుకుంటానని, మంచి ఉద్యోగం చేస్తానని నమ్మబలికాడు. తిరిగి కాపురానికి రావాలని బ్రతిమిలాడాడు. తన భర్త ఇంతలా ప్రాధేయపడటం చూసి.. నిజంగానే మారిపోయాడు అనుకొని, మూడు రోజుల క్రితమే కాపురానికి అంగీకరించింది. దీంతో.. తన భార్య, పిల్లల్ని తీసుకొని వీరంపాలంలోకి తన ఇంటికి తీసుకొచ్చాడు దావీదు.

Poonch Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరుగురి అరెస్ట్..

మొదటి రెండు రోజులు బాగానే ఉన్నట్టు నటించాడు కానీ, మూడో రోజు మళ్లీ తన నిజస్వరూపం బయటపెట్టాడు. గురువారం తన భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. అప్పుడే భార్యని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నిర్మల నిద్రలోకి జారుకున్న తర్వాత.. శుక్రవారం వేకువజామున ఆమెను దావీదు అత్యంత కిరాతకంగా చంపాడు. మెడ, చేయి కోసి.. తలను రెండు ముక్కలు చేసి హతమార్చాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాక్ష్యాలు సేకరించి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటు తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకెళ్లడంతో.. ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.

Show comments