NTV Telugu Site icon

Kakinada Fire Accident: కాకినాడ గొల్లప్రోలులో భారీ అగ్నిప్రమాదం.. నిప్పంటించి దుండగులు పరార్

Kakinada Fire Incident

Kakinada Fire Incident

Huge Fire Accident Occured In Kakinada Gollaprolu Village: అప్పటివరకూ అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ప్రజలకు హాయిగా నిద్రిస్తున్నారు. కానీ.. ఇంతలోనే ఒక ఊహించని పరిణామం అక్కడ చోటు చేసుకుంది. చూస్తుండగానే.. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది ఎలా సంభవించిందో తెలీక.. భయాందోళనలతో ప్రజలకు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. కాకినాడలోని గొల్లప్రోలులో! తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని దుండగులు.. ఒక టెండ్ హౌస్, రెండు గోనె సంచుల గోడౌన్లకు నిప్పంటించారు. దీంతో ఆ నిప్పు చుట్టుపక్కలకు వ్యాప్తి చెందడంతో.. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

Mexico Prison Attack: జైలుపై ముష్కరుల దాడి.. 17 మంది మృతి.. 25 మంది ఖైదీలు పరారీ

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి, మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు.. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. జనావాసాల మధ్య ఈ ప్రమాదం సంభవించడంతో.. జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అనే కోణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు రంగంలోకి దిగి, మంటల్ని అదుపు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Delivery Boy Attacked: ఆర్డర్ ఆలస్యం అయ్యిందని.. డెలివరీ బాయ్‌పై దాడి

Show comments