NTV Telugu Site icon

Homeguard Forgery Case: హోంగార్డు చేతివాటం.. ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా

Homeguard Stolen Funds

Homeguard Stolen Funds

Homeguard Stolen Police Funds With Forged Signatures In Nellore: అది ఒక రక్షకభట నిలయం. అంటే.. పోలీసు కార్యాలయం. సమాజంలో జరిగే అవినీతి, అన్యాయాలను అరికట్టే అధికారులుండే కార్యాలయమది. అలాంటి కార్యాలయంలోనే భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఒక హోంగార్డు ఎంతో తెలివిగా.. పోలీసులకు వచ్చే చెక్‌లను కాజేసి, సంతకాల్ని ఫోర్జరీ చేసి, నిధులని తన పేరు మీద మళ్లించుకున్నాడు. ఒక చెక్ బౌన్స్ అవ్వడంతో, ఆ హోంగార్డ్ అవినీతి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. తన పైఅధికారుల సహకారంతోనే అతడు ఈ అవినీతికి పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

TS Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉత్పన్‌నాథ్ రాజ్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి ఇతను కొందరు పోలీసుల సహకారంతో.. పోలీసులకు ఇచ్చే చెక్‌లను దొంగలించి, ఫోర్జరీ సంతకాలు చేస్తూ, తన పేరు మీద నిధుల్ని మళ్లించుకుంటున్నాడు. ఈ గుట్టు చాలాకాలం వరకు ఎవరికీ తెలియరాలేదు. అయితే.. ఇటీవల ఓ ఉద్యోగి పదవీ విరమణ చేశారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయినప్పుడు.. లెక్కల్లో తేడా రావడాన్ని గమనించారు. అప్పుడే ఆ హోంగార్డు అవినీతి బాగోతం బట్టబయలైంది. పోలీస్ స్టేషన్‌కి వచ్చే నిధులు దారిమళ్లిస్తున్నారని గ్రహించి.. ఆ కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంతో.. అసలు బాగోతం బయటపడింది. వెంటనే, ఉత్పన్‌నాథ్ రాజ్‌ని అరెస్ట్ చేశారు.

Heavy Rains: ఉత్తరాదిలో రికార్డు స్థాయి వర్షాలు.. 19మంది మృతులు.. పాఠశాలలు మూసివేత

అయితే.. ఒక హోంగార్డుకి చెక్కుల్ని దోచేయడం, సంతకాల్ని ఫోర్జరీ చేయడం అంత ఈజీ కాదు. కచ్ఛితంగా.. తెరవెనుక ఇతరుల హస్తం కూడా ఉండొచ్చని అనుమానించి, ఉత్పన్‌నాథ్‌ని విచారించారు. ఇంకేముంది.. అతడు నిజాలన్నీ కక్కేశాడు. కార్యాలయంలోని సిబ్బంది సహకారంతోనే తాను ఈ మోసానికి పాల్పడినట్టు చెప్పేశాడు. దీంతో.. మరింత కూపీ లాగేందుకు అధికారులు విచారణ చేపట్టారు. అంతేకాదు.. ఉత్పన్‌నాథ్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.36 కోటి నిధుల్ని రికవరీ చేశారు. ఆ రేంజ్‌లో డబ్బులు పోగేశాడంటే, అతడు ఎంత డబ్బు కాజేసి ఉంటాడో మీరే అర్థం చేసుకోండి.

Show comments