NTV Telugu Site icon

Homeguard Harassment: కీచక హోంగార్డ్.. పోలీస్ స్టేషన్‌లోనే వివాహితపై..

Homeguard Harassed Woman

Homeguard Harassed Woman

Homeguard Sivananda Molested Married Woman In Anantapur Police Station: తమకు ఏదైనా సమస్య వస్తే.. ప్రజలు మొదటగా తట్టేది పోలీస్ స్టేషన్ తలుపులే. కానీ.. ఇప్పుడు ఆ స్టేషన్‌లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమని రక్షిస్తారన్న నమ్మకంతో ఆ రక్షక భటుల్ని ఆశ్రయిస్తే.. వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. అందరూ కాదు కానీ, కొందరు పోలీసులు మాత్రం ఈ తరహా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ హోంగార్డ్ కూడా ఇలాంటి కీచక పనే చేశాడు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న భ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారం ఎక్కడికి దాకా వెళ్లిందంటే.. ఆ వివాహిత అవమానంగా భావించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Minister Roja: సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఒక వివాహిత తన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఓ పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పిన ఆమె.. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రైనా ఇంటికి రావడంతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. అయితే.. ఎక్కడా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో, ఈనెల 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని, పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కట్ చేస్తే.. ఈనెల 22వ తేదీన స్వయంగా ఆ వివాహితే తిరిగి వచ్చింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చేదాకా స్టేషన్‌లోనే ఉండమని పోలీసులు చెప్పారు. దీంతో ఆమె స్టేషన్‌లోనే కూర్చుంది.

Kakani Govardhan Reddy: చంద్రబాబు ఉంటే.. కరువు రాజ్యమేలుతుంది

మిగిలిన సిబ్బంది మొత్తం పని నిమిత్తం స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోగా.. హోంగార్డు శివానందా ఒక్కడే ఆ వివాహితతో పాటు స్టేషన్‌లో ఉన్నాడు. అప్పుడు అతడు మాటామాటా కలిపి, ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె పై అధికారులకు తెలియజేయగా.. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించి, వెంటనే అతడ్ని సస్పెండ్ చేశారు. అయితే.. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ వివాహిత అవమానంగా భావించింది. దీంతో.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు.. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.