NTV Telugu Site icon

Hijab Row : ఏపీకి పాకిన హిజాబ్‌ రచ్చ.. బుర్కా వేసుకొస్తే బయటకే..?

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్‌ ధరించి విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు హజరుకావద్దనే వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ హిజాబ్‌ అంశం ఏపీకి పాకింది. ఇదే తరహాలో బెజవాడలో కూడా ఓ ఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందని ఓ కాలేజీ యాజమాన్యం బుర్కా వేసుకొచ్చారని కొంత మంది ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

అయితే ఫస్ట్‌ ఇయర్‌ నుంచి తాము బుర్కాలోనే కళాశాలకు హజరవుతున్నామని, కాలేజీ ఐడీ కార్డులో సైతం తాము బుర్కాతోనే ఫోటో దిగామంటూ విద్యార్థినులు వాపోతున్నారు. దీంతో కాలేజీ వద్దకు ముస్లిం పెద్దలు చేరుకున్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన దిగారు.