జుత్తాడ గ్రామంలో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు గ్రామస్తులు. అంతే కాక జుత్తాడ గ్రామం నిర్మానుష్యంగా మారుతోంది. ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ఊళ్లకు గ్రామస్థులు పయనమవుతున్నారు. ఘటన జరిగిన శెట్టిబలిజ వీధి లో పోలీసుల పహారా కాస్తున్నా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటున్నామని మహిళలు అంటున్నారు. అంగన్వాడీ లకు, స్కూల్స్ కు తమ పిల్లలను పంపాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. భయం తో రాత్రుళ్లు మేల్కొనే ఉంటున్నామని గ్రామ రైతులు అంటున్నారు. మళ్ళీ ఇరువురు కుటుంబాల మధ్య ఏ క్షణంలో అయినా గొడవలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నిన్న వేరే ఊరిలో ఉన్న అప్పలరాజు తల్లి జుత్తాడకు వచ్చినట్టు సమాచారం. అయితే ఆమెను ఊరు నుండి వెళ్లిపోవాలని గ్రామస్తులు కోరినట్టు చెబుతున్నారు. హత్య జరిగిన ఘటన స్థలంలో ఇంకా రక్తపు మరకలు చెరగలేదని అంటున్నారు. మొత్తం మీద ఊరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆరు మర్డర్స్ భయం.. ఊరంతా ఖాళీ చేస్తున్న గ్రామస్తులు ?
